పాటల కోసం... యాభైవేల రూపాయల ఉద్యోగాన్ని వదిలేశా!
మ్యూజిక్ స్పెషల్
‘‘డబ్బు ముఖ్యం కాదు. ఆత్మసంతృప్తి ముఖ్యం. ఇష్టమైన రంగంలో కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది’’ అంటున్నారు వర్థమాన గాయని సాహితి. అతి తక్కువ సమయంలోనే గాయనిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారామె. ప్రస్తుతం విరివిగా పాటలు పాడుతూ సినీ శ్రోతల్ని అలరిస్తూ ముందుకు దూసుకుపోతున్న యువగాయని సాహితితో ‘సాక్షి’ జరిపిన చిట్‌చాట్.
ప్రస్తుతం సినిమా సంగీతం ఎలా ఉంది?
అప్పటితో పోలిస్తే.. ఇప్పుడే ప్రయోగాత్మక గీతాలొస్తున్నాయి. సాంకేతికంగా సినీ సంగీతం చాలా అభివృద్ధి చెందింది. శాస్త్రీయం, వెస్ట్రన్... ఇలా ఏ తరహా సంగీతంలోనైనా ప్రయోగాలు చేసే గాయనీగాయకులు కూడా ఇప్పుడున్నారు.
అంటే అప్పుడు లేరని మీ ఉద్దేశమా?
అయ్యో...నేను అలా అనలేదు. లతాజీ, జానకి, చిత్ర, శ్రేయా ఘోషల్. పాటల్ని వింటూ పెరిగా. ఆ రోజుల్లో ఇంత సాంకేతిక లేదు. లతాజీ, సుశీల, జానకి లాంటి లెజెండ్రీ సింగర్స్‌తో పాటు నాటి సాంకేతిక నిపుణులు కూడా ఈ కాలంలో పుట్టి ఉంటే... ఈ టెక్నాలజీతో ఇంకా గొప్ప గొప్ప ప్రయోగాలే చేసేవారు. ఎందుకంటే... ఏ టెక్నాలజీ అంతగా లేనిరోజుల్లోనే వారు చేయని ప్రయోగాలు లేవు కదా. ఇక మా విషయానికొస్తే... ఈ టెక్నాలజీ మాలాంటి వర్థమాన గాయనీగాయకులకు వరం అయ్యింది. నా ఫీలింగ్ అదన్నమాట.
చిన్నప్పట్నుంచీ పాడేవారా?
అవును. బాగా పాడేదాన్ని. చిన్నప్పట్నుంచీ పాటలంటే పిచ్చి. రేడియో, టేప్ రికార్డర్లలో పాటలు వింటూ హమ్ చేసేదాన్ని. అప్పట్లో టీవీలో వచ్చే ‘చిత్రలహరి’ కార్యక్రమాన్ని వదిలేదాన్ని కాదు. ముందు పాటలపై నాకున్న ఇష్టాన్ని గమనించింది మా అమ్మ. నాన్న మాత్రం ముందు చదువు... తర్వాతే ఏదైనా అనేవారు. నేను మాత్రం అప్పుడప్పుడు నాన్నకు తెలీకుండా పాటల పోటీల్లో పాల్గొంటుండేదాన్ని.
ఏదైతేనేం.. నాన్న మాట ప్రకారం బీటెక్ చేశాను. అయినా.. నా మనసంతా పాటలపైనే. విజయనగరంలో జరిగిన రోటరీ క్లబ్ జిల్లా స్థాయి పాటల పోటీల్లో విన్నర్‌గా నిలిచా. అప్పుడు నా టాలెంట్‌పై నాన్నకు ఓ నమ్మకం ఏర్పడింది. ఆ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన రామాచారిగారు కూడా నా పాట గురించి నాన్నతో ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పుడు నాన్న నన్ను క్లాసికల్ మ్యూజిక్‌లో చేర్పించారు. టీవీ రియాల్టీ షో ‘సరిగమప’లో విన్న ర్‌గా నిలిచాను, ‘5 సింగర్స్ చాలెంజ్’లో రన్నర్‌గా నిలిచాను.
మరి సినిమాల్లో అవకాశం?
‘సరిగమప’లో నా స్వరం నచ్చి కేఎన్ రాధాకృష్ణన్‌గారు ‘సిద్దూ ఫ్రమ్ సికాకుళం’ చిత్రంలో పాడే ఛాన్స్ ఇచ్చారు. అలా నా కెరీర్ మొదలైంది. అయితే... ఆ తర్వాత నేను అందులో కొనసాగించలేదు. మైసూర్ ‘ఇన్ఫోసిస్’లో జాబ్ వచ్చింది. వెళ్లిపోయా.
అక్కడ ఆరు నెలలు శిక్షణ తర్వాత హైదరాబాద్ పోస్టింగ్ అడిగాను. దేవుడి దయ వల్ల హైదరాబాద్ వచ్చా. సరిగ్గా అదే సమయంలో ‘ఎక్స్ ఫ్యాక్టర్ ఇండియా’ రియాల్టీ షో ఆడిషన్స్‌కి రమ్మని సోనీ టీవీవారి నుంచి ఫోన్ వచ్చింది. నా జీవితంలో మరచిపోలేని రియాల్టీ షో అది. సోనూనిగమ్, శ్రేయాఘోషల్, సంజయ్‌లీలా బన్సాలీ లాంటి లెజెండ్స్ న్యాయ నిర్ణేతలుగా ముంబయ్‌లో నిర్వహించిన ఆ కార్యక్రమంలో టాప్ 7 స్టేజ్ దాకా వచ్చాను.
దేశవ్యాప్తంగా ఈ స్థాయికి రావడం గొప్ప విషయమే కదా. ఆనందంతో హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. ఇక జాబ్ చేయాలనిపించలేదు. ఆత్మసంతృప్తి కంటే ఏదీ ఎక్కువ కాదని నిర్ణయించుకొని 50 వేల జీతం వచ్చే ఉద్యోగానికి రిజైన్ చేశాను. వెంటనే ‘రచ్చ’లో 'సింగరేణుందీ...’ పాట ఛాన్స్ వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘దమ్ము’లో ‘రూలర్...’, ‘ఈగ’లో ‘నేనె నానీనె’... లాంటి టాప్ హిట్స్ పాడాను. ఇప్పటికీ పాడుతూనే ఉన్నాను.
ప్రస్తుతం ఏయే సినిమాలకు పాడుతున్నారు?
అన్నీ పెద్ద సినిమాలే. ఆ వివరాలు త్వరలో తెలుస్తాయి.
గాయనిగా మీ లక్ష్యం?
నా తర్వాత జనరేషన్‌కి ఇష్టమైన పాటల్లో కనీసం రెండు పాటలైనా నావి ఉండాలి... అంతే

Comments
Post a Comment