భారీగా బాలయ్య వందో సినిమా

Others | Updated: May 25, 2016 08:40 (IST)
భారీగా బాలయ్య వందో సినిమా
ప్రజెంట్ టాలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో బాలకృష్ణ వందో సినిమా ఒకటి. ఎన్నో కసరత్తుల తరువాత క్రిష్ డైరెక్షన్ లో చారిత్రక చిత్రం చేయడానికి అంగీకరించాడు బాలయ్య. ఒకటో శతాబ్ద కాలంలో పాలన సాగించిన చక్రవర్తి గౌతమీ పుత్రశాతకర్ణి జీవిత కథ ఆధారంగా అదే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా, యాక్షన్ ఎపిసోడ్స్ ను మొరాకోలో భారీగా చిత్రీకరించారు. దాదాపు వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్ లతో పాటు 200 గుర్రాలు, ఒంటెలతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫిలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు కూడా పనిచేశారు.

క్రిష్ స్వయంగా నిర్మిస్తున్న గౌతమీ పుత్న శాతకర్ణి సినిమాకు ఇంకా హీరోయిన్ ఎంపిక జరగలేదు. నయనతార హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపించినా ఇంతవరకు అఫీషియల్ గా మాత్రం కన్ఫామ్ చేయలేదు. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చ
Advertisement

Comments