దర్శకుడు అట్లి నిశ్చితార్థం
తమిళ సినిమా : యువ దర్శకుడు అట్లి బుల్లితెర నటి ప్రియతో ఏడడుగులు వెయ్యడానికి సిద్ధమయ్యారు. వీరి వివాహ నిశ్చితార్థం ఆదివారం రాత్రి చెన్నైలో జరిగింది. రాజారాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన అట్లి స్టార్ దర్శకుడు శంకర్ శిష్యుడు. ఆర్య, నయనతార, జయ్, నజ్రియా నజీమ్ నటించిన రాజారాణి చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్న విషయం తెలిసిందే. కాగా బుల్లి తెర నటి ప్రియతో అట్లి ప్రేమలో పడ్డారు. ప్రియా కణాకానుంకాలంగళ్ అనే మెగా సీరియల్‌లో నటించారు. సింగం చిత్రంలో నటి అనుష్కకు చెల్లెలిగా నటించారు.
అట్లి-ప్రియల ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి వివాహ నిశ్చితార్థం ఆదివారం నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు ఆర్య, నటి నయనతార ప్రత్యేకంగా విచ్చేసి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు అట్లి మాట్లాడుతూ ప్రియ తన జీవితంలోకి రాణిగా వస్తున్నారని సంతోషంగా అన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ప్రియ తనకు తెలుసని వివరించారు.
పరిచయమైన తొలినాళ్లలో స్నేహితులుగానే మెలిగామని ఆ తరువాత ప్రేమికులయ్యామని తెలిపారు. తమ వివాహ నిశ్చితార్థానికి అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారని చెప్పారు. తమ వివాహం నవంబర్ లో జరుగుతుందని అట్లి వెల్లడించారు.

Comments
Post a Comment